మహా భాగవతం

మహా భాగవతం

Monday, December 26, 2011

మహా భాగవతం

మహా భాగవతం
నైమిశారణ్యం మన భారతదేశంలోని ముని ఆశ్రమాలు అన్నింటిలో పరమ పుణ్యమైనది . ఒకప్పుడు శౌనకాది మహర్షులు అక్కడ వైకుంఠ  ప్రాప్తికోసం వెయ్యి సంవత్సరాలు అనుష్టాన కాలంగా గల యజ్ఞం ఒకటి ప్రారంభించారు... దాన్ని దీర్గ సత్త్రం అంటారు. దీర్గ సత్త్రం అంటే ఎక్కువకాలం చేసే యజ్ఞం అన్నమాట! అప్పటికి కలియుగం ప్రవేశించింది. కలిలో ధర్మదేవతకు నాలుగు పాదాలలో తపస్సు, శోచము, దయ అనే మూడున్ను కుంతుపడతాయి...నాలుగోపడం సత్యం అదిన్ని కాలం గడిచేకొద్దీ బలహీనపడుతుంది.స్వార్ధ పరులు, అనచారులు,క్రూరులు అసత్యవాదులు పెచ్చు మీరుతారు పపులతో సహవాసం వాళ్ళ మంచి వాళ్ళుకూడా చెడిపోవచ్చును. అందువల్ల ఆ మహర్షులు పామరామానవులకు దూరంగా, ఏకాంత ప్రదేశం లో సదాచార పరాయణులై  సజ్జన గోష్టితో కాలం గడపదలచి ఆ దీర్గాసత్త్రం ప్రారంభించారు. అప్పుడు ఆ యాగం చూడటానికి ఎక్కడెక్కడినుంచో ఎంతోమంది మునీశ్వరులు వచ్చారు.అల వచ్చిన వారిలో "సూతముని" ఒకడు.

శౌనకాదులు సూతముని రాకకు చాల ఆనందించారు. ఆయనను ప్రేమతో ఆహ్వానించి గౌరవించారు. ఆయన కూడా వారి ఆదరానికి చాలా సంతోషించాడు. అక్కడికి వచ్చిన మునీశ్వరులతో ముచ్చటిస్తూ రోజులు నిమిషాలుగా గడపసాగాడు.

శౌనకాది మునీంద్రులు ఆయనవల్ల ఎన్నో పురాణగాధలు వినాలని కూతూహలపడ్డారు. వారు ఆయనను ఒకనాడు ఇలా అడిగారు.."సకల పురాణ విఙానమేత    !సూత! నీ రాకవల్ల మా దీర్ఘసత్త్రానికి వన్నె వచ్చింది.నీకు తెలియని  పురాణగాధలు లేవు నీ వల్ల ఆ కధలన్నీ వినాలని మాకు కూతుహలం కలుగుతుంది. నువ్వు మా మాకోరిక తీర్చాలి".

ఎంతో తప్పస్సు చేసి ఎన్నో విద్యలలో విధులైన పెద్దలు తనను ఆ విధం గ అడగగా "అయ్యా ! మీకంటే ఎక్కువ తెలసినవాడిన నేను! అయిన భవత్కదలు నా నోట వినాలని వేడుక పడుతున్నారంటే అది నా భాగ్యమే అనుకుంటున్నాను. నేను నాగురుదేవులైన వేదవ్యాస మహర్షుల వారివల్ల విన్నది నాకు తెలసినది మీకు వినిపిస్తాను. అని అప్పటినుంచి వారు అడిగిన కదలనని చెప్పటం మొదలు పెట్టాడు.

ఒకనాడు ఆ మహర్షులు ఆ పౌరణికుడ్ని ఇలా అడిగారు...... మాకు శ్రీకృష్ణుని కధలన్నీ వినిపించు! కలియుగం రానున్నదని ముందుగానే మేము ఈ విఘ్న  క్షేత్రం చేరి ఈ దీర్ఘసత్త్రం హరికధ శ్రవణానికి  ఓకే నిమిత్తంగా చేసుకున్నాము. అప్పుడు సూతుడు ఇలా అన్నాడు ......................


సూతముని నారాయణుని అవతారాలు చెప్పటం
"నారాయణుని అన్ని అవతారాలు మూలమైనది ఆయన మొట్ట మొదటి దివ్యరూపం. దానిని దివ్యయోగీన్ద్రులు   మాత్రమే  దర్శించగలరు ఆ దివ్యరూపుని నాభి కమలం లోనుంచి ఉదయించాడు ఆదిమ బ్రహ్మ ఎవ్వరు చెయ్యలేని తపస్సు చేసాడు.కఠోర బ్రహ్మచర్యం అవలంభించాడు. అటుపిమ్మట పాతాళం నుంచి భూమిని ఉద్దరించటానికి వరాహరూపం ధరించాడు. మూడవసారి నారదుడుఅయ్యాడు.కర్మ విమోచనం కావించే వైష్ణవతంత్రం ఉద్భోదించాడు.నాలుగవ సారి నరనారాయణ రూపాలు చరించాడు. మహాతపస్సు ఆచరించాడు. ఆరవ సారి దత్తాత్రేయుడై అలర్కుడు,ప్రహ్లాదుడు,మొదలైన వారికి ఆత్మా విద్య ఉపదేశించాడు. ఏడవ పర్యాయం యజ్ఞ నామదేయుడై స్వాయంభువ మనంతరం రక్షించాడు. ఎనిమిదవ అవతారం లో ఉపక్రముడనే పేరపుట్టి పరమహంస మార్గం ప్రకటించాడు.తొమ్మిదవ మూర్తి లో పృధుచక్రవర్తి అయి గొరూపధారిని అయిన భూదేవినుంచి సమస్త వస్తువులు పితికాడు.దశమం మీనవతరం ఆసమయం లో హరి వైవస్వతమనువును భూరూప నౌకమీద చేర్చి రక్షించాడు. పదకొండవ పర్యాయం కూర్మమై మందర గిరిని వీపున దాల్చి పాల సముద్రాన్ని చిలుకుతున్నాడు దేవతలకు అమ్రుతోత్పత్తి సాయపడ్డాడు. పన్నెండవమారు ధన్వంతరి అయినాడు ఆయుర్వేదం లోకానికి ప్రసాదించాడు.పదమూడు మోహిని అవతారం. పద్నాల్గవ అవతారం నృసింహావతారం,పదిహేనవది వామనరూపమా. పదహారోరూపం భార్గవరాముడు. పదిహేడు వేదవ్యాసమూర్తి,పద్దెనిమిదవ రూపం శ్రీరామచంద్ర మూర్తి,పందొమ్మిదవ మారు బలరాముడుగా ,శ్రీకృష్ణుడుగా అవతరించాడు. తరువాత బుద్దుడుఅయ్యి అవతరించాడు. కలియుగాంతంలో కల్కి మూర్తిగా అవతరించి ధర్మసంస్తాపనం చేస్తాడు. అతి రహస్యమైన ఈ హరిజన్మ కధ మాపు రేపు చదువుతూ వుంటే మానవుల సంసార దు:ఖాలన్ని నశిస్తాయి .



ద్వాపరయుగ   కాలంలో   ఉపరిచర వస్తువు వీర్యం వల్ల వాసవి అని పెరుపొందిన సత్యవతికి పరాశర మహర్షివల్ల నారాయణాంశ తో జన్మించాడు వ్యాసమహర్షి. ఆ మహర్షి సరస్వతితీరన బదరికారణ్యంలొ నివశిస్తు,సర్వవర్ణాశ్రమాలకు మేలు చెయ్యాలని  ఒకటిగ ఉన్న వేదాన్ని ఋగ్వేదం,యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం, అని నాలుగు భాగాలుగ విభజించారు.అటు తరువాత ఇతిహాస పురణాలన్ని పంచమవేదంగా పలికాడు. తన శిష్యులైన పైలుడు,జైమిని,వైశంపాయనుడు,సుమంథుడు, అనే నలుగురిని వరసగ  ఋగ్వేద,యజుర్వేద, సామవేద ,అధర్వణవేదాలను అధ్యయనం చెయ్యవలసినదిగ చెప్పాడు. పురాణేతిహాసలను మా తండ్రి అయిన రోదుహర్షుణుని చేత చదివించారు. ఇలా వారిశిష్యులు వేదలను పురణేతిహాసాలను నేర్చి  తన శిష్యులకు నేర్పుతు వచ్చారు. ఆ మహర్షి విచారపడుతు ఉండగ వీణ మీటుకుంటు ఆకాశం నుంచి అవతరించాడు  నారద మునీంద్రుదు. 
  "పరశర కుమారా ! నువ్వు పంచమ వేదం నిర్మించిన విధాతవు !బ్రహ్మతత్వ నిర్నేతవు.ఇంతటి  నువ్వు కూడ పామరుడి మాదిరిగ విచరపడుతున్నావేమిటి ? నువ్వు సమస్త ధర్మాలు చెప్పావు  గాని ఏ గ్రంధంలొను విష్ణుకధలు కొంచమైన చెప్పలేదు .వట్టి ధర్మాలు ఎన్ని చెప్పిన శ్రీహరి  మెప్పు ఎల కలుగుతుంది ? హరినామస్తుతిగల కావ్యం బంగారు తామరలతో  రాజహంసల తో కూడిన సరస్సులాగ ప్రకాశిస్తుంది హరినామ స్తుతిలేని కావ్యం ఎన్ని విచిత్రార్ధల తో  కూడినదైనా దుష్టులతో  నిండివున్న నరకకూపం లాగ శోభావిహీనమై వుంటుంది. హరి పరక్రమాలు వర్ణించు ! హరి కీర్తనం వల్ల చదువు,నీతి,తపస్సు,దానమూ, బుద్దీ, సజ్జన గోష్టి అనె వాటికన్నింటికి ఫలం కలుగుతుంది కదూ....




నారద పుర్వ జన్మ
"మహత్మ ! నేను పూర్వకల్పంలొ మొట్టమొదటి జన్మంలో వేద విదుల ఇంటిలోని ఓ  దాసికి జన్మించాను. ఒకప్పుడు వారి ఆఙచేత నేను వానకాలంలొ ఒకచోట చాతుర్మాస్యం గడపదల్చుకొన్న యోగులకు పరిచర్య చెయ్యటనికి వెళ్ళాను.వారితొపాటు నేను గూడ విఘ్నసేవ చేస్తూ వచ్చాను. ఇల హరిసేవసక్తి చేత ఆ యోగులమూలాన ఈ శరీరం మాయకల్పితమని నాకు తెలిసింది. రజస్తమో గుణాలను పరిహరించే భక్తి సంభవించినది.అంతలో నాలుగు నెలలు గడచిపోగ ఆ యోగీశ్వరులు యాత్రార్ధులై వెళ్ళుతు నాకు ఈశ్వర రహస్యం ఉపదేశించారు .వారి ఉపదేశం వల్ల నాకు విష్ణు మాయతత్వం తెలసింది. ప్రణవ పూర్వంకంగా వాసుదేవ,ప్రద్యుమ్న, సంకర్షణా నామాలు నాలుగు భక్తి తో ఉచ్చరించి నమస్కరించి మంత్రమూర్తి,మూర్తి షూన్యుడు అయిన యఙపురుషమూర్తిని పూజించే పురుషుడికి సమ్యగ్ధదర్శనం కలుగుతుంది.నేనివిధంగా చెయ్యగ  ఆ శ్రీహరి తన్ను గురుంచిన విఙానం నాకు ప్రసదించాడు . నా అనుష్ఠానం ఆ స్వామికి తెలుసు. నువ్వు కూడ ఈ విధంగా ఆచరించు.నువ్వు పెద్దలవల్ల ఎన్నో విశెషాలు విన్నవాడివి. నువ్వు ప్రతిదినం హరిస్తుతి చేస్తు ఉంటె వినేవరి దుఃఖమంతా హరిస్తుంది".
                అప్పుడు వ్యాసమహర్షి యిల అడిగాడు.
  "నారదా ! ఆ సాధువులు  నీకు చిన్నతనం లొ ఙానోపదేశం చేసి పోగా పెద్దవైన తరవాత ఇలాంటి నడవడి నీకు అలవాటు అయింది.అయితే ఆ పూర్వకల్పం  నాటి అనుభవం ఇప్పుదు నీకు ఎల గుర్థులొ ఉన్నది ? దాసి కుమారుడివైన ఆ జన్మం ఎలా గడిపావు ?" అందుకు నారదుదు ఇల జవాబు చెప్పాడు.
 "దాసి పుత్రుణ్ణైన నేను ఆ యోగిశ్వరులవల్ల ఙానొపదేశం పొందిన తరువాత ఒకనాటి రాత్రి మా అమ్మ ఆవుపాలు పితుకుతు ఉండటంలొ ఒక పామును తొక్కి దాని కాటుకు గురి అయి మరణించినది. అప్పటికి నాకు అయిదేళ్ళు.అమ్మ మరణించినందుకు నేను ఏమాత్రమూ చింతించలేదు. ఉన్నబంధం ఒకటి తొలగిపొయిందని సంతోషించి ఏకాంత స్తలంలో విష్ణు సేవతో  జీవితం గడపదలచాను. ఒక అడవిలో ఒక మడుగు చేరుకుని స్నానం చేసి దాహం తీర్చుకుని, ఒక రావిచెట్టువద్ద కూర్చోని విష్ణుధ్యానం ప్రారంభించాను. నా మనస్సులొ ఆ భగవంతుడు గోచరించాడు. ఆ సంతొష పారవశ్యంలొ కొంతసేపు నన్ను నేను మరచిపోయాను. అటుపిమ్మట లేచి నిలబడి ఆ స్వామి దివ్యరూపం తిలకించాలని ప్రయత్నించాను. ఏమితోచక ఆ అడవిలొ  వెర్రివాడిలాగ తిరగటం మొదలుపెట్టాను. అప్పుడు శ్రీహరి నా శోకాన్ని  ఉపశమింపజేయగోరి మధురవాక్యలతో  యిల అనునయించాడు." 
"వత్సా ! ఈ విధంగా శ్రమపడతావెందుకు ? ఈ జన్మలొ నువ్వు నన్ను చూడలేవు. అయిన నా పట్ల కలిగిన ఆసక్తి వ్యర్ధంకాదు. ఈ భక్తి జన్మాంతరాలలొ కూడ నిన్ను విడిచిపెట్టదు. ఈ శరీరం విడిచిన తరువాత మరుసటి జన్మంలోనూ నా భక్తుడివై వుంటావు.ఈ సృష్టి అంతరించిన మీదట ప్రళయరాత్రి వస్తుంది. దాని పరిమితి  వెయ్యియుగాలు.అటుపిమ్మట పునఃసృష్టి జరుగుతుంది. అప్పుడు నువ్వు పూర్వజన్మ ఙానంతొ జన్మిస్తావు పవిత్రుడివై శుద్ధసాత్త్వికులలో ఎన్నిక పొందుతావు.
      ఇల ఆకాశం మూర్తిగా, ఋగ్వేదాదులు నిట్టూర్పులుగా,సమస్తాన్ని శాసించే మహభూతం నన్ను ఉద్దేశించి పలికి మిన్నకున్నది. నేను ఆ స్వామిని ఉద్దేశించి తలవంచి మ్రొక్కి ఆ కారుణ్యానికి సంతోషించి అరిషడ్వర్గాన్ని తరిమివేసి హరిలీలలు స్మరిస్తు కాలవశుణ్ణయి  ఆ శరీరం విడచి మరుసటి జన్మలో కూడ హరిభక్తుణ్ణయినాను. తర్వాత ప్రళయరాత్రి రాగ నారాయణమూర్తి యందు నిద్రించబోయే బ్రహ్మ నిట్టుర్పు వెంట ఆయనలో ప్రవేశించాను. సహస్త్త్రయుగ పరిమితమైనకాలం గడిచిన తరువాత లోకసృష్టికి పూనుకున్న బ్రహ్మనుంచి పుట్టిన మరీచి మొదలైన వారితో నేను జన్మించాను. అప్పటినుంచి. అస్కలిత బ్రహ్మచారినై హరి అనుగ్రహం వల్ల మూడులోకాలలోను ఎటువంటి ఆటంకమూ లేకుండా, పరమేశ్వర ప్రసాదితమై బ్రహ్మప్రశంసచేసే సప్తస్వరాలు అప్రయత్నంగా పలుకుతూ ఉండే ఈ వీణతొ గొంతుకలిపి హరికధాగానం చేస్తు సంచరిస్తున్నాను. ఇది నా పూర్వజన్మ వృత్తాంతం.
         ఈ విధంగా నారదుడు తన వృత్తాంతం వ్యాసమహర్షికి వినిపించి యదేచ్చగ అడిగాడు.
            అని సూతముని చెప్పగ శౌనాకాదులు " మరి నారదుడు వెళ్ళిన తరువత భగవంతుడు బాదరాయణుడు ఏం చెశాడు ? అని అడిగాడు అప్పుడు సూతమునీంద్రుడు ఈ విధంగ అన్నాడు.
            "అప్పుడు భగవంతుడు బాదనారయణుడు సరస్వతీ పశ్చిమ తీరన బదరీ తరవులతో విస్తరించిన సుప్రసిద్ధ తపోవనంలో ఏకాంతం కూర్చోని భక్తియుక్తిచిత్తంలో శ్రీహరి సాన్నిధ్యం కల్పించుకొన్నాడు.
           నారయణభక్తి జన్మింపజేసే భాగవతామ్నాయం ఎంతో  నేర్పుతో నిర్మించాడు. నిర్మించి, మొక్షార్థి అయిన శుకయోగి చేత ఆ అమ్నాయాన్ని చదివించాడు.


అశ్వత్థామకు అవమానం
ఇది యిల ఉండగా కురుక్షేత్ర యుద్దంలో భీమునివల్ల దుర్యోధనుడు తొడలువిరిగి పడిన తరువత అశ్వత్థామ దుర్యోధనుడికి ప్రియం చెయ్యదలచి నిద్రావస్తలొ ఉన్న ద్రౌపది కుమారుల శిరస్సులు ఖండించుకొనిపోయి ఆ కౌరవరాజుకు సమర్పించాడు. కుమరులైదుగురూ, ఒకే పర్యాయం దారుణ మరణం పాలైనందున ద్రౌపది ధుఃఖం భరించలేకపొయింది. అప్పుడు అర్జునుడు ఆమెను ఓదార్చి అశ్వత్థామను శిక్షించటానికి శ్రీకృష్ణుడు నడిపే రధం ఎక్కి వెళ్ళాడు.
          అశ్వత్థామ అర్జునుణ్ణి  చూచి భయకంపితుడైనాడు. ఓపిక ఉన్నంత సేపు పరుగెత్తి తన రధశ్వాలు మరి పరుగెత్తలేకపొవటం గమనించి ప్రాణాపేక్షతో బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని  ఉపసమ్హార విధానం తెలియక పోయిన ప్రయోగించాడు. ఆ అస్త్రం మహగ్నిజ్వాలలు చిమ్ముతు వస్తుంటె అర్జునుడు "శ్రీకృష్ణా ! ఈ తేజస్సేమిటి ? భూమ్యాకాశాలు రెండు ఆక్రమించి నాకు ఎదురుగా వస్తోంది" అని అడిగాడు. అందుకు హరి యిల చెప్పాడు.
              "అర్జునా ! ఇది కుటిలుడైన అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం. దీనిని బ్రహ్మాస్త్రం చేతనే నివారించు ! ఆ బ్రాహ్మణ కుమరుడికి ఉపసమ్హారం తెలియదు"
            హరి ఆనతి శిరసావహించి అర్జునుడు జలం ఆచమించి, ఆ స్వామికి ప్రదిక్షనం చేసి, అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం మీద తాను బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు.  అప్పుడు అస్త్రాలు రెండు అన్యోన్య కలహానికి పూనుకొన్నాయి. అందువల్ల లోకవినాశనం కలిగేట్టున్నందువల్ల అర్జునుడు శ్రీకృష్ణాఙతచేత ఉభయాస్త్రాలనూ తానే ఉపసమ్హరించాడు. అశ్వత్థామను పట్టుకొని యాఙీకుడు పశువును బంధించేట్టు  బంధించాడు.వీణ్ణి శిబిరానికి కొనిపోయి అందరు చూస్తు ఉండగా వధిస్తాను ! అంటూ ఉండగా శ్రీకృష్ణుడు "అర్జునా ! వీడు తనజోలికే రాక నిద్రాసక్తులై ఉన్న పసిపిల్లలను వధించిన కౄరుడు,శిక్షార్హుడు. అయితే భయపడేవాణ్ణీ, దిగులుచేత మతిబ్రష్టుడైనవాణ్ణీ,ఓడిపొయినవాణ్ణీ, సాధువై జడత్వంతో సంచరించేవాణ్ణీ, రక్షించు అని మొరపెట్టేవాణ్ణీ, స్త్రీలను చంపడం ధర్మం కాదు కౄరుడై ఇతరులను చంపి తన ప్రాణాలను రక్షించుకో జూచినవాడు నరక ధఃఖాల పాలౌతాడు. రాజదండనంవల్ల యమదండం తప్పించుకొంటాడు వీణ్ణి ఆ యమదండానికే గురికాని ! అని అతని ఆగ్రహాన్ని ఉపశమింపజేసాడు. ఆ మాటలవల్ల అపరాధి అయిన బ్రహ్మణుడు వధ్యుడు కాడనే ధర్మాన్ని స్మరించి అర్జునుడు అశ్వత్థామను చంపకుండా పట్టి రధమ్మీద చేర్చి శిబిరం వద్దకు తెచ్చి, ద్రౌపది ముందు నిలబెట్టాడు. అశ్వత్థామ తన అకార్యనికి సిగ్గుపడుతు ద్రౌపది ముఖం చూడలేక పెడమొగం పెట్టాడు. ద్రౌపది సుస్వభావి కాబట్టి  గురుపుత్రుడు, విప్రుడు అయిన అతనికి  మొక్కి ఇల అన్నది.
"తండ్రి ! మా వారందరూ మీ నాయనగారివద్ద అస్త్రవిద్యలన్నీ నేర్చుకున్నారు గదా ! నువ్వు పుత్రరూపాన ఉన్న ద్రోణాచార్యుడివే కదా ! కొంచెమయిన దయలేకుండా శిష్యుల బిడ్డలను చంపడం న్యాయమా ? నువ్వు బ్రాహ్మణుడివి. ఒళ్ళెరగకుండా నిద్రపోతున్న పసిపిల్లల్ని చంపటానికి నీకు చేతులెల వచ్చాయో ? పుత్రశోకంతో గుండెలు పగిలిపొతూ ఉన్న నా మాదిరిగానె యుద్ధం లో నిన్ను మా కిరీటి పట్టితేవటం విన్న మీ అమ్మగారు నీకోసం ఎక్కడ ఎల విలపిస్తున్నారో !"
            అని ఆ దయామయురాలు కృష్ణార్జునలతో "గర్భశోకం భరించలేక నేను  కుమిలిపొతున్నట్టే  ఈ కుమారుడి కోసం తల్లి కృశించి ఎంత తల్లడిల్లుతు ఉంటుందో ! ఇతన్ని విడిచిపెట్టండి ! అన్నది.
              ఆ ద్రౌపదిదేవి మాటలకు ధర్మనందనుదు సంతోషించాడు. కాని నకుల సహదేవ సాత్యకి కృష్ణార్జునులు  సమ్మతించారు. భీముడు మాత్రం సమ్మతించలేదు.
              "ఈ ద్రౌపది పిచ్చిదికాకపొతే ! వీడు నా కొడుకుల్ని పట్టి చంపాడే అనే  కోపం  కూడ లేకుండ ఈ భాలఘాతకుణ్ణీ  విడిచిపెట్టండంటుందా ? విడవటమేమిటి ? నా పిడికిటి పోటుతో వీడి తల వక్కలు చేస్తాను" అన్నడు.
              అంతలొ ద్రౌపది అడ్డం వచ్చింది. శ్రీకృష్ణుడు నాలుగు చేతులు ధరించి రెండు చేతులతో ద్రౌపదిని అవతలికి పంపి, రెండు చేతులతో భీముణ్ణి అడ్డగిస్తు  "భీమసేనా ! నువ్వన్నమాట నిజమే ! వీణ్ణి రక్షించ కూడదు కాని, ఎంత నీచుడైన బ్రాహ్మణ  కులంలో పుట్టాడు కదా ! "బ్రహ్మణోనహంతవ్య" అని వేదం ఘొషిస్తోంది కదా ! కాబట్టి నువ్వు శాంతించాలి " అని మెత్తని మాటలతో శాంతింపజేసి, అర్జునుణ్ణి చూచి "ద్రౌపదికి, నాకు, ఈ భీమసేనుడికి సమ్మతం గా, పూర్వం నువ్వు చేసిన ప్రతిఙ కూడ కలసివచ్చేట్టుగ నా ఆఙ నిర్వర్తించు !" అన్నాడు. అనగానే అర్జునుడు ఖడ్గం దూసి,అశ్వత్థామ శిరోజాలను ఖండించి వాటిలోపల ఉన్న శిరోమణిని తీసుకుని 'పోరపో'మ్మని అతనిని శిబిరం నుంచి గెంటివేసాడు.
       ఇల అశ్వత్థామను పరాభవించిన తర్వాత పాండవులు శ్రీహరి సెలవు ప్రకారం యుద్ధం లో మరణించిన బంధువులందరికి పరలోకక్రియలు జరిపారు. హరి పుత్రశోకాతురులైన దృతరాష్ట్రులను కుంతి ద్రోపదులను బంధు మరణానికి దఃఖపడుతున్న తక్కినవారిని ఓదార్చాడు. ధర్మరాజుకు పట్టాభిషేకం జరిపించి అతనిచేత మూడు అశ్వమేధ యాగలను చేయించాడు.


 శ్రీకృష్ణుడు  ఉత్తర గర్భంలోని పరీక్షితుణ్ణి రక్షించుటం :
 అటుపిమ్మట ఆ భగవంతుడు ద్వారకకు వెళ్ళదలచి రధం యెక్కబొతు ఉండగా తత్తరపడుతు ఉత్తరవచ్చి యిల మొరపెట్టింది. "తండ్రీ ! ఇదేదో కాలగ్ని సమానమైన బాణం నా గర్భాన్ని కాల్చటానికి వస్తున్నది. దీన్ని తప్పించుకొనడం నావల్ల గావటంలేదు.దిక్కులేక వచ్చి నిన్ను ఆశ్రయిస్తున్నాను. గర్భస్తుడైన శిశువును కాపాడు !"
         ఉత్తర మొరవిన్న పరమేశ్వరుడు అది అపాండవం కావలని అశ్వత్థామ ప్రయోగించిన దివ్యాస్త్రమని గ్రహించి, తన చక్రంచేత ఆ బ్రహ్మాస్త్రాన్ని నివారించి,ఉత్తరగర్భస్తుడైన్ శిశువును రక్షించాడు. అప్పుడు కుంతిదేవి ద్రౌపదితోను,పాండవులతోను వచ్చి ఆ స్వామిని అనేక విధాల కొనియాడింది.
    తరువాత ధర్మనందనుడు బంధువులను సమ్హరించినందుకు ధుఃఖ పడుతు  శ్రీకృష్ణుడూ వ్యాసమహర్షీ భీష్ముడూ మొదలైన పెద్దలు ఎన్ని విధాల చెప్పినా విషాద విముక్తి పొందలేకపొయాడు.
        నిరాహారదీక్ష అవలంబించి,ఒకనాడు సోదరులతో శ్రీకృష్ణాది బంధువులతో భీష్ముడు శయనించి ఉన్నచోటికి వెళ్ళాడు  . అప్పుడే బృహదశ్వ భరద్వాజ పరశురామాదులయిన మునులు తమ శిష్యులతో గూడ అక్కడికి వచ్చారు. భీష్ముడు  వచ్చిన వారందరిని యదోచితంగా మన్నించి తనకు మ్రొక్కిన ధర్మరాజాదులను దీవించి కూర్చుండవలసిందని చెప్పి ఈ విధంగా అన్నాడు.
    "పాండు పుత్రులార ! బ్రాహ్మణులూ, శ్రీహరి, ధర్మమూ దిక్కుగ ఎంచుకున్న మీరు ఎన్నో కష్టాలు పడ్డారు. ఇటువంటి చిత్రం ఎక్కడయిన ఉందా ? మీ తల్లి అయిన కుంతి మీ తండ్రి గతించినప్పటినుంచి మిమ్మల్ని పెంచి పెద్దవాళ్ళను చెయ్యటానికి ఎన్నో  కష్టాలు పడింది ! ఒక్కనాడు సుఖపడి ఎరుగదుగదా ! మబ్బులు గాలివల్ల విడిపోతు ఉన్నట్టు ఈ లోకం కాలవశమై సమయోగ వియోగాలు పొందుతూ ఉంటుంది. కాలం ఎప్పుడు ఒకే  విధంగా నడవదు దాన్ని ఎవరు అతిక్రమించలేరు.

  కాబట్టి దైవతంత్రానికి చింతించాల్సిన పనిలేదు. దిక్కులేనివారికి దిక్కయిన శ్రీ మహావిష్ణువే ఈ శ్రీకృష్ణుడు .ఆయిన యాదవులతో చేరి ఎవరికి గుర్తించరానివాడై అందర్ని తన మాయచేత మోహింపచేస్తున్నాడు. శివుడు,నారదుడు,కపిలుడు ఈ భగవంతుని లీలలు ఎరుగుదురు. మీరు కృష్ణుడు మా మేనమామ కొడుకు దేవకినందనుడు అని దూతగా, సచివుడుగా, సారధిగ, బంధువుగా, మిత్రుడుగా సమయోచితంగా వినియోగించుకుంటున్నారు. ఇందువల్ల మీకు ఏమి కొరతలేదు, సర్వాత్మకుడయిన హరికి ఔన్నత్యమూలేదు, హీనతలేదు. అయిన ఈ మహత్ముడు  భక్తవత్సలుడు కాబట్టి ఏకాంత భక్తులకు సులభుడుగానే ఉంటాడు.

        ఎవనియందు మనస్సు లగ్నం చేసి,ఎవని నామం కీర్తించి, శరీరం విడుస్తు యోగి కామ నిర్మూలనం చేస్తాడో అట్టి సర్వేశ్వరుడు నేనుఎప్పుడు ప్రాణాలు విడుస్తానో అని ఇదిగో చిరునవ్వుతో వికసిత ముఖారవింధుడై చతుర్భుజుడై కమలనయనుడై నా ముందు నిలచివున్నాడు. నా భాగ్యం ఎంత గొప్పదో" !
         ఈ విధంగా భీష్ముడు అనగా ధర్మరాజు సమయోచితంగా సంభాషించి ఆ కురువౄద్దునివల్ల నరజాతి ధర్మాలు, వర్ణశ్రమ ధర్మాలు, ప్రవృత్తి నివృత్తి ధర్మాలు, దానధర్మాలు, రాజధర్మాలు, స్త్రీ ధర్మాలు మరెన్నో ఉపఖ్యానాలు, ఇతిహాసాలు మొదలైనవి అడిగి తెలుసు కొన్నాడు. అంతలో  స్వచ్చందదురణులైన యోగీశ్వరులు వాంచించే ఉత్తరాయణం వచ్చింది. ఆ పుణ్యకాలం రాగనే గంగా  నందనుడు అది తనకు మఱణొచిత సమయమని నిశ్చయించుకుని మాటలు చాలించి ,చూపులు హరి మీద నిలిపి భాణవ్యధ మరచి, నిశ్చల చిత్తంతో కృష్ణస్తుతి గావిస్తు ఆ భగవంతునిలో లీనమయ్యడు.
       ధర్మరాజు ఆ కురుపితమహునికి పరలోక క్రియలు జరిపించి శ్రీకౄష్ణాదులతో హస్తినాపురం ప్రవేశించి గాంధారి ధ్రుతరాష్ట్రుల సమ్మతితో రాజ్యపరిపాలనం ప్రారంభించాడు.
      అది సూతుడు చెప్పగా శౌనకుడిల ప్రశ్నించాడు.  
    "తన ధనాన్ని అపహరించి తనతో యుద్ధం చేసిన ఆకతాయి చుట్టాలను సమ్హరించినందుకు చింతాకలుడయిన ధర్మారాజు తిరిగి రాజ్యమేలడానికి ఎలా సమ్మతించాడు ?"
     అందుకు సూతుడీవిధంగా చెప్పాడు
    "నారయణుడు పరిక్షన్మహరాజును  కౌరవ వంశాంకురం గా నిలిపి ధర్మరాజుచేత రాజ్యపాలన చేయించాడు. ఆ భగవంతుడు చెప్పిన మాటల వల్ల ధర్మపుత్రుడు సకల సంశయాలు తీరిపోవడంచేత ఆ స్వామినే ఎడుగడుగా భావించుకొని రాజ్యపాలనానికి అంగీకరించాడు.




 శ్రీకృష్ణుని ద్వారకాగమనం

అంతట కొంతకాలానికి శ్రీకృష్ణుడు ధర్మరాజదులను యెలాగో ఒప్పించి రధారూడుడై ద్వారకకు బయలుదేరాడు.రాజవీధి పొడుగునా సౌధాగ్రాలమీద నిలచి హస్తినాపురకాంతలు ఆ కళ్యాణ మూర్తి మీద కుసుమ వర్షాలు కురిపించారు.
    శ్రీహరి తన విరహం సహించలేక వెంబడించివచ్చే ధర్మజ భీమార్జున నకుల సహదేవాదులను ప్రియోక్తులతో అనునయించి మళ్ళించి ద్వారకాభిముఖంగ పయనించాడు. కురుజాంగన పాంచాల శూరసేన యామున భూములుదాటి బ్రహ్మవర్త కురుక్షేత్ర మత్స్య సారస్వత మరుధన్వ సౌవీర భీర దేశాలు గడచి ఆయ దేశాదీశులు సమర్పించే కానుకలు అంగీకరిస్తు సాయంకాలనికి ద్వారకనగరం సమీపించాడు.
           సమీపించి పాంచజన్యం పూరించాడు. ఆ శంఖధ్వని వినగానె ప్రజలందరూ తమ ప్రభువు వచ్చాడని గ్రహించి ఆనందోత్సాహాలతో తన్మయులౌతూ కనకాంబరాలు బహువిధాల ఆమూల్య ద్రవ్యాలు గైకొని రకరకాల వాద్యద్వనులు చెలరేగుతూ ఉండగా స్వామికి ఎదురు వచ్చారు. తాము తెచ్చిన కానుకలు సమర్పించారు.
      శ్రీకృష్ణుడు తనరాక వినగానే అనురాగాతిశయంతో, ఎదురు వచ్చిన ఉగ్రసేనుడు,అక్రూరుడు, వసుదేవుడు, బలబద్రుడు, ప్రద్యుమ్నుడు,సాంబుడు, చారుదేషుడు, గదుడు మొదలైన యదుముఖ్యులను ప్రణామాలింగనాదులతో యదోచితంగా  సంతుష్టుల్ని చేసి వారితో గూడ మహావైభవంగా ద్వారకా నగరంలోకి ప్రవేశించాడు.
          నగరప్రవేశం చేసి ముందుగా తల్లితండ్రులను దర్శించి వారి ఆశీర్వాదాలు పొంది పదహారువేల నూటేనిమిది బంగారుమేడలుకల అంతఃపుర ప్రవేశించి తనమనస్సులో ముందుగ ఒక సుందరి యింటికి వెళ్ళితే మరొకతే విచరపడుతుందేమో ? మనస్సువిప్పి పలకదేమో ! కన్నువిచ్చి చూడదేమో ! అని శంకించి అందరి సౌధాలలోను అన్ని రూపాలతో ఒకేమారు ప్రవేశించాడు.
         ఆ శుద్దాంత కాంతలు పతి రాకకు సంతోషిస్తూ శిశువులను ఎత్తుకొని ముంగిళ్ళకు వచ్చేటప్పుడు దిగాజారుతు ఉన్న కటిసూత్రాలు విరహాగ్ని కాకకు తమ శరీరాలు చిక్కిపోవడం చాటుతూ ఉన్నందుకు సిగ్గుపడుతూ, భర్తను ఎదుర్కొన్నారు.
          "నాధుడు నా యింటికే ముందువచ్చాడు" "ఇదిగో ! ప్రాణేశ్వరుడు ముందర నా మందిరానికే వచ్చాడు ""కాంతుడు నా గృహానికే ప్రప్రధమంగా వచ్చాడు!" అని ఎవరికివారే సంతోషిస్తు ఆ జగదీశ్వరుణ్ణి ఆ పదహారువేల నూట ఎనిమిదిమంది భామలు అత్యంత భక్తి  ప్రేమలతో అర్చించారు.
      ఇల చెప్పిన సూతుణ్ణి తిలకించి శౌనకుడు ఈ విధంగా ప్రశ్నించాడు.

పరీక్షిజ్జననం

"సూతమునీంద్రా ! అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రాగ్నికి కంపించిన ఉత్తరగర్భాన్ని శ్రీకృష్ణుడు బ్రతికించాడంటారు కదా ! తల్లిగర్భంలో ఉన్న శిశువును హరి ఎల బ్రతికించగలిగాడు ? ఆ కుర్రవాడు మృత్యుభయం విడచి ఎంతకాలం జీవించాడు ? అతని చరిత్ర ఎమిటి ? శుకమహర్షి అతనికి ఙానోపదేశం చెయ్యడం ఎల సంభవించింది ? అతను శరీరత్యాగం చెయ్యటం ఏవిధంగా సంభవించింది ?ఇదంతా తేటతెల్లంగా వినిపించు !'
   అప్పుడు సూతుడిల వినిపించాడు.
     "ధర్మనందనుడు అఖండ సామ్రాజ్యాన్ని నిష్కంటకంగా పరిపాలిస్తు యెన్నో భోగాలు అనుభవిస్తున్న వాటిమీద ఆయనకు మనసు ఉండేదికాదు. శ్రీహరి పదసేవలో ఆయనకు తనివి తీరేదిగాదు.
      ఈ విధంగా కొంతకాలం అశ్వత్థామ గడచిన తర్వాత ఉత్తరగర్భాస్తుడైన బాలుడు పదిమాసాలు నిండగా అశ్వత్థామ బాణాగ్నికి తాళలేక తల్లడిల్లుతూ మొరపెట్టే ఓపికలేదు. ఈ ఉదరగోళం  లోపల ఉన్నాను ? నాకు దిక్కేది, తాను అనాధనని మా అమ్మ అనుకుంటూ ఉండగా యెన్నోసార్లు విన్నాను. ఈ మంటలెల తొలగిపొతాయి? నన్ను రక్షించే తండ్రి ఎవడు ? దైవమా ? ఈ గర్భంలో కలిగేభాధ ఎవరికి తెలుస్తుంది ? నేను ఈ అస్త్రాగ్ని జ్వాలల చేత మరణించి బయటికి పోలేకపొతే మితిమీరిన గర్భవేదనతో నా తల్లికూడ మరణిస్తుంది. బాణజ్వాలలు క్రమ్ముకున్నంతలో శ్రీహరి వచ్చి రక్షించగలడని మా అమ్మ తోడి స్త్రీలతో అంటువుంటుంది యెప్పుడూ. ఆమాట ఇప్పుడు సత్యం అవుతుందా ?సమస్త భూతాలతో వెలిగేవాడు నన్ను చూడటానికి ఇక్కడికి రాడ ?ఇక్కడలేడా ? ఈ మంటల అమ్మును తొలగించి నాకు అభయప్రదానం ఇయ్యడా ? పూర్వం తనకు మ్రొక్కే వారిని రక్షించేవాడు కూడా ? యెందరిని రక్షించలేదాయన ? మరి నాఖర్మం యెలాంటిదో అని చింతించసాగాడు.
 అప్పుడు భక్తపరాధీనుడైన పరమేశ్వరుడు అంగుష్ఠ మాతృదేహుడై మహోజ్జ్వల తేజస్సుతో గాదాధరుడై ఆవిర్భవించి, ఆ శిశువు చుట్టూ, తన కొరివివంటి గదను జిరాజిరా తిప్పి,అశ్వత్థామ బాణాగ్ని నశింపచేసి, ఆ శిశువుకు ఆనందం కలిగించాడు. గద చేబట్టి, వచ్చి ఈ శరీరాగ్నిని చల్లార్చి నన్ను రక్షిస్తున్న ఈ దయమయుడెవరో ?అని ఆ బాలుడు తనవంక చూడగానే అద్రుశ్యుడయ్యడు.
        అంతట ఒక శుభలగ్నంలో సర్వశుభగ్రహాలూ అనుకూలంగా ఉన్న సమయాన ఉత్తర కుమారుణ్ణి కన్నది. వంశోద్దారకుడు జన్మించాడని విన్న ధర్మనందనుడు జాతకకర్మాదులు మహవైభవంగా జరిపించి బ్రాహ్మణులను షడ్రసోపేతమైన విందుతో సంత్రుప్తులను చేసాడు. అప్పుడు వారు ఆయనతొ ఇల అన్నరు.
       "మహరాజా ! దైవయొగాన కౌరవ సంతతి నశించిన,వంశవిచ్చేదం కానివ్వక శ్రీకృష్ణుడు  ఆ బాలుణ్ణి బ్రతికించాడు. కాబట్టి ఇతను శాతవ్రాంతకుడైన విష్ణురాతుడుగా ప్రసిద్దుడౌతాడు.
          నరేంద్ర ! నీ పౌత్రుడు ఇక్ష్వాకు శ్రీ రామ, శిబి ,భరత, ధనుంజయ, కర్తవీర్య, ముఖ్యులమాదిరిగా, లోకోత్తర చరిత్రుడౌతాడు. సకల సద్గుణ సంపన్నుడు, సర్వభూతహితుడు,మహా పరాక్రమవంతుడు కాగలడు. అశ్వమేధ యాగాలు ఆచరిస్తాడు.పాపులను పట్టి శిక్షించి కలిదోషాలు నివారిస్తాడు. తన రాజ్యం రామరాజ్యంగా చేస్తాడు. వేదశాస్త్రాలను అనుసరించి మెలగుతాడు.మీదు మిక్కిలి శ్రీవిష్ణు భక్తి పరాయణుడౌతాడు. ఇల చిరకాలం జీవించి ఒక బ్రాహ్మణ కుమారుని శాపం వల్ల తనకు పాముకాటు చేత మరణం కలగగలదని తెలుసుకోని సర్వసంగాలు ముకుంద చరణాల విందాలను హృదయంలో ప్రతిష్టించుకొని శుకయోగీశ్వరునివల్ల ఆత్మఙాన సంపన్నుడై గంగాతీరాన శరీరం విడచి భయశోక రహితమైన లోకం ప్రవేశించగలడు" అని చెప్పి భూరిసత్కారాలు పొంది వెళ్ళారు. 
           తన తల్లి కడుపులోపల తాను చూచిన భగవంతుడు విశ్వంలో అంతట నిండివున్నాడని పరిక్షించేవాడు. కాబట్టి ఆ బాలుడ్ని ప్రజలు పరీక్షిత్తు అని కొనియాడసాగారు. దినదినాభివృద్ధి చెందే ఆ శుక్లపక్ష చంద్ర కళ చందంగా ఆ కుమారుడు తాతలు తనను ముద్దుగా పెంచుతూ ఉండగా పెరిగి సకలాంగ సౌష్టవంతో పరిపూర్ణ  విగ్రహుడయ్యడు.
         అంతలో ధర్మరాజు బంధు సమ్హార దోషనివృత్తికోసం శ్రీకృష్ణుని  అనుమతిపొంది. మహవైభవంగా మూడు యాగాలు చేసాడు. తర్వాత శ్రీకృష్ణుడు  అర్జునుడ్ణి వెంటబెట్టుకొని ద్వారక నగరానికి వెళ్ళాడు.     
        అంతకుముందే విధురుడు తీర్ధయాత్రకు వెళ్ళి మైత్రీయ మహర్షి విశేషాలు తెలుసుకొని, ఆత్మవిఙానం పొంది హస్తినాపురానికి తిరిగివచ్చాడు. ధర్మారాజు విదురుడ్ని ఎంతో ఆదరించి తీర్థయాత్ర వెశేషాలు అడుగుతూ "ద్వారకలో యాదవులందరు శ్రీకృష్ణుని కరుణచేత వర్ధిల్లుతున్నారుకదా ! అని అడిగాడు. విదురుడు తాను తెలుసుకున్న విశేషాలెన్నో ఆ మహరాజుకు ఎరిగించాడు. కాని, తెలిసి కూడ అతనికి భరించరాని ధుఃఖం కలుగుతుందని శిష్ట మరణం శూద్రుడు చెప్పకూడదని యాదవక్షయం గురించి చెప్పలేదు. 
          మరి విధురుడు శూద్రుడుగ పుట్టటానికి ఒక కారణం వుంది . పూర్వం మాండవ్య మహర్షి యమధర్మరాజును శూద్రయోనియందు జన్మించవలసిందని శపించాడు. ఆ శాపం వల్ల ధర్మదేవుడు శూద్రకాంతకు విదురుడనే పేర జన్మించాడు. విధురుడు ధరాలోకంలో వున్నంత కాలం అర్యముడు పాపులను దండించే భాద్యత వహించాడు. ఈ విధం గా శ్రీకృష్ణుడు నిర్యాణం తెలియని ధర్మనందనుడు భీమాదులతో గూడి సంతోషంతో రాజ్య మేలుతు మనుమని ముద్దు ముచ్చటలు చూసి ఆనందిస్తు కొంతకాలం గడిపాడు. విదురుడు ఒకనాడు ద్రుతరాష్ట్రునితో ఇల అన్నాడు.




                      గాంధారి ద్రుతరాష్ట్రుల దేహత్యాగం .....


 "మహరాజా, నువ్వు పుట్టు గ్రుడ్డివి. వయస్సుమీరినవాడివి.నీ ఇంటికి నువ్వు వదిన మాత్రమే మిగిలారు. దాయదుల పంచన శోకముగ్నులై రోజులు గడుపుకుంటున్నారు.ఇది ఒక బ్రతుకా ! ఈ శరీరం నిత్యంకాదని గ్రహించి, మోహం విడచి, మునివృత్తి అవలంబించి, ఉత్సాహంతో ఇల్లు విడచి వెళ్ళిన మనుష్యుడు ముక్తి పొందుతాడు."
            విదురుని ఉపదేశం నచ్చింది ధ్రుతరాష్ట్రునికి. గాంధారిదేవి కూడ ఆ మాటల్ని మెచ్చుకున్నది. విదురసమేతులైన ఆ వృద్ధ దంపతులు చెప్పకుండ ఒక రాత్రివేళ హస్తినాపురం విడచి హిమవత్పర్వత ప్రాంతానగల వనానికి పయనించారు. తెల్లవారిన పిమ్మట యెప్పటివలె పెత్తండ్రికి పెత్తల్లికి నమస్కరించటానికి వచ్చిన  ధర్మనందనుడు వారు కనిపించనందుకు ఆందోళనపడుతూ అక్కడ కూర్చుని ఉన్న సంజయుణ్ణి "సంజయా ! మా పెదతండ్రిగారు, పెదతల్లిగారు కనిపంచరేమిటి ? ఎక్కడికి వెళ్ళారు ?" అని అడిగాడు . అప్పుడు సంజయుడు కూడ విచారపడి, "మహరాజా ! రాత్రి చాలా సేపు విదురుడు ఆయనా ఎంతోసేపు మాట్లాడుకున్నారు.ఇప్పుడు ఎవరు లేరు. ఆ ముగ్గురు నాకు కూడ చెప్పకుండ ఎక్కడికి వెళ్ళారో ?" అని కన్నీరు పెట్టుకున్నాడు. అంతలో తుంబుర సమేతుడైన నారద మునీంద్రుడు సాక్షాత్కరించి "ధర్మరాజా ! తల్లులెవరు ? తండ్రులెవరు ? కుమారులెవరు ? బందుమిత్రులెవరు ? ఇదంత మాయప్రభావం ! నువ్వు ఎవరికోసము చింతించవద్దు. శ్రీకృష్ణుడు ఉన్నంతకాలమూ మీరు ఇక్కడ ఉండండి. అటు తర్వాత ఈ లోకంతో మీకు పనిలేదు. నేను ఇలా అంటున్నానని ఆశ్చర్య పడవద్దు. కాలన్ని తప్పంచుకోవడం ఎవరితరం కాదు. ద్రుతరాష్ట్రుడు విధురగాంధారులతో హిమలయ పర్వతానికి దక్షిణాన ఉన్న ఒక తపోవనానికి వెళ్ళాడు. అక్కడ సమస్తమూ విసర్జించి. నిరాహరాదీక్షతో అంతిమక్షణం కోసం ఎదురుచూస్తున్నాడు నేటికి ఐదవ రోజున యోగాగ్ని చేత శరీరం దహించుకుంటాడు గాంధరి భర్తతో పాటు అగ్నిప్రవేశం చేస్తుంది వారి మరణానికి ధుఃఖించి విదురుడు తీర్ధయాత్రలు చేస్తాడు. అని చెప్పి స్వర్గాభి ముఖంగా  వెళ్ళాడు. అప్పుడు ధర్మపుత్రుడు భీమసేనుణ్ణి చూచి యిల అన్నాడు.
 


          
   ధర్మరాజు చింత
"భీమసేన ! ఓషదులు  ఒకప్పుడు ఫలించి ఒకప్పుడు ఫలించటం లేదట ! నరులు కామక్రోదవశులై అసత్యమంటె భయంలేకుండ ఉన్నారట ! లోక వ్యవహారలన్నింట మోసం తాండవిస్తున్నదన్నమాట ! చూడు ! కాలగతి యెంత వింతగా ఉన్నదో !
      అర్జునుడు ! ద్వారకకు వెళ్ళి ఇంతకాలమయింది. అక్కడినుంచి ఈ యేడు నెలలలో ఒక్క వార్తహరుడు కూడ రాలేదు. యాదవులు సుఖంగా ఉండి ఉంటార ? మురారి కుశలంగా ఉండి ఉంటాడా ? యెందుకో నా మనసు అపాయం శంకిస్తోంది. ఈశ్వరుడు ఏం  చేయనున్నడో ? ఎన్నెన్నొ దుర్నిమిత్తాలు గోచరిస్తున్నాయి తమ్ముడా  !
           యవపద్మచాప చక్రాది రేకాలంకృతమైన హరి పద్మద్వయం యిక ఈ భూమిమీద సోకదేమో ! నా యెడమకన్నూ యెడమ భుజమూ మాటి మాటికి అదురుతున్నాయి. ఈ భూమికి ఏ దురవస్త రానున్నదో!"


 ద్వారకనుంచి అర్జునుడు వచ్చి కృష్ణ నిర్యాణం వినిపించుట

   ధర్మనందనుడు ఇల అంటుండగానే ద్వారకనుంచి అర్జునుడు వచ్చాడు. వస్తునే రోదిస్తూ అగ్రజుని పాదలమీద పడ్డాడు. అందుకు మరింత కలవరపడుతూ ఆ పాండవాగ్రజుడు తమ్ముణ్ణి చూచి ఇల అన్నాడు.
         "అర్జునా ! ద్వారకలో మనబందువులందరికి క్షేమమే కదా ?సత్యాదేవి ముద్దు చెల్లించడం కోసం స్వర్గానికి వెళ్ళిన పారిజాతం భూమికి తెచ్చిన మహత్ముడు మురారి సుఖంగానే వున్నాడు కదా ? ఆ బలరామకృష్ణులు నిన్ను మన్నిస్తునే వున్నారు కదా ? అక్కడి చుట్టాలందరు మనక్షేమం కోరుతూ ఉన్నారు కదా !  ఏనాడు కన్నీరెరగని వాడివిల దఃఖిస్తున్నావేమిటి !"
          అగ్రజుడు అడుగుతు ఉండగ అర్జునుడు అతి ప్రయత్నంతో దుఃఖాన్ని అరికట్టుకుంటు ఈ విధంగా చెప్పాడు.
           " దేవా ! మన సారధి మన సచివుడు మన వియ్యము మన చెలికాడు మన బంధువు, మన ప్రభువు, మన వేలుపు, మనల్ని విడచి వెళ్ళాడు.
            "మహరాజా ! నే ఎంత దురదృష్టవంతుణ్ణో ! నన్ను అంత మన్నించిన జగదీశ్వరుడు కృష్ణుడు ఎడమైపోయిన ఇంక బ్రతికే వున్నాను ఆ స్వామి పత్నులను పదహారువేల మందిని వెంటపెట్టుకోని మన పురానికి వస్తూ వున్న నన్ను అరణ్యంలో అడ్డగించి బోయలు నేను చూస్తూ ఉండగానే వారిని అందరిని పట్టుకోగా నేను ఆడదాని  మాదిరిగా చూస్తు నిలబడ్డానేకాని ఏమి చెయ్యలేకపోయాను.
           "దేవ ! యాదవులు మునిశాపం వల్ల కాలదీనులై మద్యపానం చేసిన మత్తులో కయ్యాలాడి తమను తామే చంపుకున్నారు.ఎవరో నలుగురైదుగురు మాత్రమే మిగిలారు. బలహీనులకూ, బలవంతులకూ, వైరాలు పుట్టించి,విలయం కలిగించి, భూభారం  మాంచి,  నిర్విచారంగా చెయ్యవలసింది చేసి, ఆ సర్వేశ్వరుడు ఈ లోకం విడచిపెట్టాడు. ఇంక నేను ఏం చెప్పను ? "
     ఈ విధంగా అన్నకు విన్నవించి అర్జునుడు వైరాగ్యం అవలంభించి మాటలు చాలించాడు. ధర్మపుత్రుడున్ను నారదముని మాటలు స్మరించి. స్వర్గగమన ప్రయత్నంలో ఉన్నాడు. అంతలో కుంతిదేవి యదుక్షయవిని మనస్సులో హరిని నిలుపుకుని దేహం చాలించింది.

 ధర్మరాజు మహప్రస్థానం

      అప్పుడు ధర్మరాజు మనుమడైన పరిక్షిత్తును రాజ్యపట్టభిషేకం చేసి విరక్తుడై ప్రాజాపత్యమనే యఙం చేసి అగ్నులను ఆరోపించుకొని సమస్త భ్రాంతులూ విడచి నిరహారుడు ముక్తకేశుడు అయ్యి ఉత్తరదిశ ముఖుడై వెళ్ళాడు. భీమార్జున నకులసహదేవులూ, ద్రౌపది భౌతిక శరీరాలు విడచి వైకుంఠం చేరారు. విదురుడు ప్రభాసతీర్థంలో ప్రాణ పరిత్యాగం చేసి పితృవర్గంతో కూడ దండదరుడై తనలోకం ప్రవేశించాడు.
       పిదప పరిక్షిత్తు బాల్యం నుంచి పెద్దల శిక్షణలో పెరిగినందువల్ల మహభక్తుడై రాజ్యమేలుతు ఉత్తరుని కూతురైన ఇరావతిని వివాహం చేసుకున్నాడు. ఆమెయందు జనమేజయుడు మొదలైన కుమారులు కలిగారతనికి. కృపాచార్య శిష్యుడై అతను గంగాతీరాన నిజరూపాలతో హవిస్సులందుకొనవచ్చిన దేవతలను తిలకించగలుగుతు మూడు అశ్వమేధ యాగాలు ఆచరించాడు. ఒక పర్యాయం ఆ మహరాజు దిగ్విజయం చేస్తూ ఒకచోట గోమిధునాన్ని తన్నుతున్న శూద్రస్వరూపుడు రాజచిహ్న ముద్రితుడు అయిన కలినిపట్టి నిగ్రహించాడు.
                   అని చెప్పగా శౌనకుడు ఆ పౌరాణికుడిని  ఇల అన్నాడు.   
 
 భూధర్మ దేవతల సంవాదం
         "రాజచిహ్న ముద్రితుడై ఆ శూద్రుడు గోమిధునాన్ని దేనికి తన్నాడు ? పరిక్షిన్మహరాజు దిగ్విజయం చేస్తు కలిని నిగ్రహించటం ఎల తటస్థించింది.?"
    అనగ సూతుడీవిధంగా చెప్పాడు.
    "పరిక్షిన్మహారాజు దిగ్విజయ కుతూహలంతో సకల సేనహితుడై బయలుదేరి వరుసగ నాలుగు సముద్రాలలోనూ ఉన్న ఇలవృత రమ్యక హిరణ్మయ హరివర్ష కింపురుష భద్రాశ్వకేతుమాల భారతవర్షాలు ఉత్తరకురుభూములు జయించాడు. ఆయా దేశాలలోని స్తుతి పాఠకులవల్ల పూర్వ రాజ చరిత్రలు విన్నాడు. శ్రీకృష్ణ పాండవుల అనుబందం వర్ణించే  పద్యాలు విన్నాడు . విని శ్రీహరి యందు ద్విగుణీకృత భక్తికలవాడైనాడు.
          ఆ సమయంలో వృషభరూపధరుడై ఏక పాదం తో సంచరిస్తున్న ధర్మనపుడు తన సమీపాన లేగలేని లేగటికుట్టి విధాన వన్నేమాసి కన్నీరు విడుస్తున్న గోరూపధరిణి అయిన భూదేవితో ఇలా అన్నాడు.


 "తల్లీ ! కన్నీరు పెట్టుకుంటావెందుకు ? ఒంటికాలితో నడిచే నన్ను క్రూరులు  పట్టి బందిస్తారనా ? యాగాలు సాగనందువల్ల దేవతలకు హవిస్సులు ఉండవనా ? ప్రజాపాలనలో న్యాయం నిలవదనా ? మానవుడు తినడం,తాగడం,నిద్రపోవడం మొదలైనవే తప్ప ధర్మ కార్యాలు తల పెట్టరనా ? ఇనాళ్ళు శ్రీహరి మానవరూపుడై తన పాదస్పర్శచేత తనయించి తనయించి అద్రుశ్యుడై నందువల్ల అనాధనైనానే ! ఇకపైన ఏ దుర్మార్గుడు ప్రభువవుతాడో ! ఏ అగచాట్లు అనుభవించవల్సిన వస్తుందో అనా ! కాల వైపరిత్యాన శ్రీకృష్ణుడు ఎడమైపోగానే దేవతలకు కూడ ముచ్చటగా ఉండే నీ ఓప్పందం తప్పిపోయింది కదా?
         అనగా భూదేవి ఇల అన్నది
        "తండ్రీ ! నువ్వు పూర్వం నాలుగు పాదాల నడిచేవాడివి ఆ శ్రీహరి లేకపోగానే ఒంటికాలివాడివయ్యావు కదా ! ఆ జగన్నాధుడు లేనందున వల్ల కలిగే ప్రేరణ వల్ల పాపబుద్దులైన జనుల్ని చూచి చింతపడుతున్నాను.! దేవతలకు,ఋషులకు,పితృదేవతలకు,నాకు,నీకు బుద్దిమంతులకూ, నానావర్ణాశ్రమాలకు,గోవులకు భాదకదా అని విచారపడుతున్నాను. పద్మ,చక్ర, మత్స,శంక,చాప,కేతు,రేఖలు గల వాసుదేవునుకి శ్రీచరణాల స్పర్శ ఇక లేదుకదా అని ధుఃఖపడుతున్నాను.  
       ఈ విధంగా సరస్వతీ తీరాన ధర్మదేవుడు,భూదేవి వృషభధేను రూపాలు ధరించి సంభాషిస్తు ఉన్నచోటికి వచ్చాడు పరిక్షన్మహరాజు.

కలిపురుషుడు ధర్మదేవతను తన్నడం.

    అంతలో కాలక్రోధుడు,దండహస్తుడు, నృపాలకారుడూ, అయిన ఒక శూద్రుడు వచ్చి ధర్మదేవతను చతికిలపడేట్టు తన్నాడు. అంతటితో పోక దుఃఖదేవత మాదిరిగా ఉన్న గోవును కూడ తన్నాడు. వాడి దౌర్జన్యం చూచి పరిక్షన్మహరాజు ధనుస్సు ఎక్కుపెట్టి ఆ దుష్టున్ని ఉద్దేశించి ఇలా అన్నాడు.
         "ఓరి దుర్మతీ ! ఈ గోవులు నిన్ను పొడిచాయ ? నీ మీదకు వచ్చాయా  ? నువ్వు ఏ మాత్రం భయంలేకుండా ఆ సాధుప్రాణుల్ని తన్నడానికి కారణం ఏమిటి ? నేను శాసించే ఈ భూమిలో యెప్పుడు యెక్కడా ఎవ్వరు నేరాలు చేయకూడదని ఎరగవా ? నీ అపరాధానికి శిక్షించకమానను. కృష్ణార్జునులు లేరుకదా అని మదించి దండించరాని వారిని దండిస్తావా ! నువ్వే దండార్హుడివి!"
 అని వృషభాన్ని ఉద్దేశించి,
 "గోరూపదేవా ! కౌరవేశ్వర బాహురక్షితమైన భూమండలంలో ఈనాడు వీటి కన్నీటిని తప్ప మరే జంతువులున్నూ అధర్మంవల్ల విడిచే కన్నీటిని ప్రజలు చూచి ఎరుగరు. ఈ దుర్మార్గుణ్ణి ఇప్పుడే సమ్హరిస్తాను చూడు ! నిన్ను నాలుగు పాదాల నడిపిస్తాను. "
        అని గోరూపధారిణి అయిన ధారుణిని ఉద్దేశించి,
    "శుభ ప్రదాయనీ! మహవైభవ శాలిని అయిన గోపాలమౌళి ఎక్కడికి పోయాడని ధుఃఖంతో సగమై కన్నీరు విడువకమ్మా ! ఏమి భయపడకమ్మా !ఈ నీచుణ్ణి ఇప్పుడే వధిస్తాను.
      దుష్టునినిగ్రహానికి శిష్టరక్షణానికే రాజులను బ్రహ్మదేవుడు సృష్టించాడని చెబుతారుగదా ! ఆ పరమధర్మాన్ని నేను పాలించి తీరుతాను."
     అనగా ధర్మాదేవుడు ఆ ధర్మనందన పౌత్రునితో ఇల అన్నాడు.
 "మహరాజా ! నువ్వు కౄరసమ్హారం చేసి సాదు సంరక్షణ చేసిన పాండవ వంశంలో జన్మించినవాడివి. మీ పెద్దలు అటువంటి మహనీయులు కావడం వల్లనే కదా భగవంతుడు  కృష్ణుడు మెచ్చి వారి పక్షాన రాయబారినికి పూనుకున్నాడు.
     నరేంద్రా ! మావల్ల ఎవరికి ధుఃఖం కలగదు. అసలు సుఖదుఃఖాలిచ్చేది ఆత్మ అని అంటారు. యోగీశ్వరులు. దైవఙులు అయితే యిదంతా గ్రహచారమే అంటారు. మీమాంసావాదులు సమస్తం కర్మఫలం అంటారు లోకాయతికులు స్వభావమే అన్నింటికి కారణం అంటారు. కాని సుఖ దుఃఖ ప్రదాత ఒక్క ఈశ్వరుడే !
       అనగా పరిక్షన్మహరాజు ఈ విధంగా అన్నాడు.
      "అయ్యా ! నువ్వు ధర్మ మూర్తివి. నువ్వు చెప్పింది పరమధర్మం ఇదిగో, వాడు ఈ పాపం చేశాడు అంటు పాపకర్ముల్ని ఎంచటం ప్రారంభిస్తే పాపచారలకు పట్టిన గతే మిగతా వారికి పడుతుంది. ఇంతేగాక దేవ మాయ వల్ల ప్రాణులకు మధ్యుల్ని, ఘాతకుల్ని గుర్తించడం సాధ్యంకాదు.నువ్వు ధర్మదేవతవు . తపస్సు, శౌచము, దయా, సత్యము  అనే పాదం కుంటుపడింది. ద్వాపరంలో తపస్సుతోపాటు శౌచం కూడ పడింది, కలిలో దయ అనేది కూడ తగ్గింది, మిగిలిన ఈ సత్యమనే పాదం కలియుగం గడిచినకొద్ది కుంటుపడుతుంది.
      ధర్మఙా! అది అల ఉంచి ఈ భూదేవికి చూచావా! తన భారమంత తొలగించి భగవంతుడు శ్రీకృష్ణుడు చరణ స్పర్శతో పులకింపచేస్తు ఉంటే సుఖపడి ఇప్పుడు ఆ భాగ్యం కొల్పోయి, నీచులు ప్రభువులు తన్ను శాసిస్తారు కదా అని దుఃఖిస్తున్నది."


పరిక్షన్మహారాజు కలిని నిగ్రహించటం
   ఇలా అని ఆ రాజేంద్రుడు కత్తి దూసి కలిని వధించబోయాడు అంతలో వాడు రాజరూపం విడిచి భయకంపితుడౌతు ఆ మహారాజు పాదాల మీద వ్రాలాడు.
   "మహరాజా!నువ్వు కన్నెర్ర చేయగానె వచ్చాను. ఈ శవాన్ని ఇంక చంపడం ఎందుకు ? నేను నీ దాసుణ్ణి, నా ప్రాణం నిలబెట్టు !" అని వేడుకున్నాడు



         అప్పుడు విజయపౌత్రుడు నవ్వాడు

         "ఓరి ! శరణార్ధివి కాబట్టి బ్రతికావు. ఇప్పటినుంచి దౌర్జన్యం విడచి జీవించు.అర్జున పౌత్రుడు శరణార్ధులను చంపలేడు. నువ్వు పాపుల చుట్టానివి. కాబట్టి నేను పాలించే భూమిలో ఎక్కడ ఉండకు! దూరంగా పో !"
       అని ఖడ్గం చాచి కలిని శాసించాడు. అందుకు వాడు మహరాజా ! నీ కటారిని చూస్తుంటెనె నా గుండే పగిలిపొతున్నది. ఎక్కడా ఉండవద్దంటే నాకు తలదాచుకొనే చొటేది ? నాకు ఎటు చూచిన ఖడ్గపాణి  అయిన నువ్వే కనిపిస్తున్నావు"   అని వాపోయాడు. అప్పుడా రాజశేఖరుడు ప్రాణివధ, స్త్రీ , జూదము, మధ్యపానము, అనే నాలుగు చోట్లు వాడికి ప్రసాదించాడు. వాడు మళ్ళీ ప్రార్ధిస్తే అసత్యం, మదం, కామం,హింస, వైరం అనే అయిదు తావులిచ్చాడు. ఈ తొమ్మిది చోట్ల తప్ప ఇంకెక్కడ ఉండకు. అని వాణ్ణి విడిచిపెట్టాడు. తపస్సు, శౌచము, దయా, అనే లోపించిన పాదాలను ధర్మ దేవతకు ఇచ్చి భూధేవికి సంతోషం కలిగించి కరిపురానికి వెళ్ళి యధాపూర్వకంగ రాజ్యపాలన సాగించాడు.  
     కలియుగం లో చేస్తేకాని పాపం అంటదు. చెయ్యలనుకోగానే పుణ్యం లభిస్తుంది. కాబట్టి. మోసం లేదని కలిని సమ్హరించకుండ విడిచి పెట్టాడా  దయమయుడు.

       పరిక్షిన్మహరాజును శృంగి శపించటం.
   ఒకనాడు పరిక్షిన్మహరాజు దుష్ట మృగాలను సమ్హరించి ప్రజలకు వాటివల్ల హానిలేకుండా చెయ్యడానికి ఒక వనంలో వేటాడుతున్నాడు. ఎంతోసేపు వేటాడి ఎన్నో కౄర జంతువులను సమ్హరించి, ఆకలిదప్పులకు లోనై ఎక్కడా చల్లని చెరువైన కనిపించనందువల్ల తిరిగి తిరిగి ఒక తపొవనానికి వెళ్ళాడు. ఆ ఆశ్రమం లో సమధినిష్టుడై ఉన్నాడు శమీకమహర్షి. మహరాజు ఆ మహర్షి ముందు నిలబడి "స్వామి ! వేటాడి వేటాడి దప్పిక కలిగి యిలవచ్చాను.చల్లని నీళ్ళు ప్రసాదించి నా దాహం తీర్చరా ! " అని అడిగాడు. సమాధిలో ఉన్న మునీశ్వరుడు పలకలేదు. అందుకు కోపం వచ్చింది ఆ మాహరాజుకు.
     "ఈ బ్రాహ్మణుడికి ఎంత గర్వం ! కళ్ళుమూసుకు కూర్చున్నాడు. ఎంత మౌనం ఐతే చేసన్న చెయ్యగూడదా ? ఇన్ని నీళ్ళు పొయ్యగుడదా ? ఏ పళ్ళైన పెట్టగూడదా ? తన తపస్సుతో అంత గొప్పవాడు అయ్యాడ ?
    నీళ్ళు కోరెవారికి శీతలపానీయం యివ్వడం ఎంతటి వారికైన అడ్డగించరాని పరమధర్మం. ...... ఈ ముని నా దాహం తీర్చడెందుకు ?
       అని మహాగ్రహంతో పరిసరాలు పరికించాడు . ఒకచోట చచ్చిన పాము కనిపించింది. దాన్ని వింటికొనకు తగిలించి తెచ్చి ఆ మునీంద్రుని భుజం మీద పడవేసి తన పట్టణానికి వెళ్ళాడు ఆ ప్రభువు.



     అప్పుడు చేరువలో వున్న ముని కుమారులు ఆ మహర్షి కుమారుడైన శృంగి అనే బాలుని వద్దకు వెళ్ళి "శృంగి ! ఎవడో రాజు మంచి నీళ్ళకని వచ్చి, మీ నాయన గారి మెడలో చచ్చిన పాము వేసిపొయాడని చెప్పారు. ఆ మాటలు వినగానే ఆ ముని బాలుడు. రోషంతో భగ్గుమన్నాడు.


    బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అదిరిపడేట్టు విసురుగా నడిచి కౌశికి నదిలో జలం ముట్టి తనను యేమి అనని తండ్రి భుజం మీద పామును పెట్టిపోయిన ఆ పొగరుబోతు రాజు హరిహరుల చాటున దాగిన ఈ రోజు నుంచి ఏడవరోజు తక్షక విషాగ్ని జ్వాలల్లొ మలమల మాడి చస్తాడు గాక!" అని శపించి,తిరిగి ఆశ్రమానికి వచ్చాడు. వచ్చి, భుజం మీద సర్ప శవంతో అలాగే కుర్చొని వున్న తండ్రిని చూచాడు. పామును తీసే నేర్పులేక ఎలుగెత్తి విలపించటం మొదలుపెట్టాడు.

       అప్పుడు ఆ రోదన ధ్వనివల్ల శమీక మహర్షి సమాధికి భంగం కలిగింది . ఆ మహత్ముడు. మెల్లగ కన్నులు తెరిచి. భుజం మీద వ్రేలాడుతున్న సర్ప శవాన్ని చూచి పారవేసి, "వత్సా మనం ఎవరికి ఏ కీడు చెయ్యం. సర్వలోక సమూలం ! ఈ పాము నా భుజం మీద ఎల వచ్చింది ? నువ్వు విలపిస్తున్నావెందుకు ?" అని కుమారిణ్ణి అడిగి అతనివల్ల జరిగిందంతా విన్నాడు . కుమారుడు చేసిన పనికి సంతోషించక ఇల అన్నాడు.
         "నాయన ! ఆ రాజు చేసిన చిన్న అపరాధానికి అంత ఘొరశాపమా !"
        మంచి నీళ్ళకోసం  మన ఇంటికి రాగ భక్తితో గౌరవించి పంపాలి గాని శపించవచ్చునా ?"
      అని సంతాపపడుతు, శమీక మహర్షి ఒక శిష్యుణ్ణి  పిలచి, శృంగి శాపం వినిపించి దానికి తగ్గ ప్రతీకారం, ఏదైనా చేసి ప్రాణసంరక్షన  చేసుకోవలసిందని పరిక్షన్మహరాజుతో చెప్పిరమ్మని పంపాడు. ఆ శాపం విన్న అభిమన్యుకుమారుడు తన అవివేకపు పనికి చింతించాడే కాని మునిబాలుడి మీద కోపగించలేదు.   


పరిక్షన్మహరాజు ప్రాయోపవేశం 


    తిరిగి శపించే శక్తివున్న శృంగిని శపించలేదు. తనకు ఏడవరోజున తక్షక విషాగ్నిచేత తప్పదని నిశ్చయించుకొన్నాడు.రాజ్యం విసర్జించాడు.నిరాహారదీక్ష అవలంభించాడు. పవిత్ర గంగ ప్రవాహంలోనె శరీర త్యాగం చెయ్యదలచి, మనస్సు హరిచరణ లగ్నంచేసి, ఆ దివ్యనదీ తీరాన ప్రయోపవెశం చేసాడు.






      అప్పుడు ఆ వార్త విని అత్రివసిష్ట విశ్వామిత్రాదులైన బ్రహ్మర్షులు రాజర్షులూ, దేవర్షులూ, మరెందరో, కాండార్హులు నానాగోత్ర సంజాతులైన ఋషులు అక్కడికి వచ్చారు.ఆ రాజేంద్రుడు వారికందరికి నమస్కరించి "మహాత్ములారా ! నేను సమాధినిష్టుడనై ఉన్న మహర్షిమీద సర్పశవం వేసిన దురాత్ముణ్ణి ! మహాపాపిని మీరు పాపతర్పణాలను దహించే అగ్ని దేవులు ! నా పాపం నశించేమార్గం  చూపరా ! ఎన్నిజన్మలు కలిగిన హరిస్మరణ మరవకుండ ఉండటానికి ఉపాయం సెలవియ్యరా ?" అని గంగా నదిని కొనియాడి ఆ మహర్షి బృందం మధ్య తూర్పువైపు కొనలుగ దర్బాసనం మీద ఉత్తరాభిముకుడై కూర్చున్నాడు. కుమారుడైన జనమేజయుణ్ణి రప్పించి రాజ్యభారం అతనికి ఒప్పగించాడు. నిశ్చల చిత్తుడై హరిధ్యానం చేస్తు ప్రయోపవేశం అవలంభించాడు. వెంటనే స్వర్గం నుంచి దేవతలు పూలవానలు కురిపించారు.

        అప్పుడు ఆ పరమభగవంతుడు "మహర్షులార ! మీకు తెలియని విశేషాలు లేవు కదా ! నేను జీవించగలిగే ఈ ఏడురోజులలోను సంసార చింత నశించి మోక్షం పొందటానికి అనుసరించదగిన మార్గం ఉపదేసించండి ! మీ దయవల్ల పునర్జన్మ దుఃఖం లేకుండ సుఖిస్తాను" అని అడిగాడు. అతని మాటలకు మునీశ్వరులందరూ ఆలోచన దీనులయ్యరు.
 శుఖమహర్షి రాక
 అంతలో శుఖయోగీంద్రుడు విచ్చేసాడు. అక్కడ ఉన్న మహర్షులు ఆ మహరాజు కూడ ఆయనను ఎంతో గౌరవించి పూజించారు. అప్పుడు మహరాజు యోగిరాజును ఇల అర్థించాడు.
  "వివేకభూషణా! దివ్యభూషణ ! ఈనాడు భాగ్యం ఎటువంటిదో ! పావనమూర్తివి పుణ్యకీర్తివి సరిగ ఈవేళకు వచ్చావు నాకు మోక్ష మార్గం ఉపదేశించవా ?"




                ద్వితీయస్కంధం

         సూతమహర్షి శౌనకాదులకు ఈ విధంగ వినిపించాడు.
        అప్పుడు శుకయోగీంద్రుడు పరిక్షిన్నరేంద్రునితో ఇల అన్నాడు.
     శుకుడు పరిక్షిత్తునికి ముక్తిమార్గం ఉపదేశించటం
   "మహరాజ ! మంచి ప్రశ్న వేశావు. వినతగినవి యెన్నివేల విషయాలో ఉన్నాయి.  వాటిలో ఇది ముఖ్యమైనది. సంసారులు కొంచెమైన ఆత్మతత్వం తెలుసుకోరు. ఎప్పుడు భార్యలతో వినోదిస్తు నిద్రిస్తూ, రాత్రి గడుపుతారు. పగలు కుటుంబంకోసం పశువులూ,  భార్యలు, కుమరులూ ! చుట్టాలు, శరీరమూ మొదలైనవన్ని, సత్యమును కొంటూ,కపురాలు చేసి చేసి చివరకు మరణిస్తారు. మరణం రానున్నదని తెలసి కూడ, అంత్యకాలంలో అనుసరించదగిన మార్గం,తెలుసుకోరు. దుఃఖ విముక్తి కోరేవారు సర్వత్మకుడూ, మహవైభవుడు, అయిన శ్రీ విష్ణుదేవుణ్ణి  గురుంచి వినాలి . ఆ భగవంతుణ్ణి ఆరాదించాలి. ధ్యానించాలి. అలా చేసినవారికి పునర్జన్మం లేదు.
       పూర్వం ఖట్వంగ మహరాజు సప్తదీపాలను పాలిస్తు ఒకప్పుడు దానవులతో యుద్ధం తటస్తించిన  దేవతలు సాయం కోరగ వెళ్ళి దానవసంహారంలో వారికి సాయపడ్డాడు. దేవతలు సంతోషించి నీకు కావల్సిన వరం అడుగు ! అనగా "నాకు ఇంక ఎంత ఆయువు వుందో చెప్పండి !" అని అడిగాడు. వారు "నీకు ఒక్క ముహూర్త  కాలమే ఆయువుంది ? " అని చెప్పారు. వెంటనె రాజేంద్రుడు ఆకాశయానాన భూలోకానికి  వచ్చి, తన సామ్రాజ్య సంపద సమస్తం విసర్జించి, హరినామ కీర్తనతో భయవిముక్తుడై, మోక్షము పొందాడు.
        పరిక్షిన్నరేంద్రా ! నీకు ఏడు రోజులకు గాని మరణభయం లేదు. ఈలోపల మోక్షము సంపాదించవచ్చు. మరణము ఆసన్నమయిందని భయపడనక్కరలేదు. ముందుగా పుత్రకళత్రధనాదులయందుగల మోహాన్ని తెంచుకోవాలి.

       శుకుడు భక్తిమార్గం చెప్పటం
 పూర్వం కమలసంభవుడు వేదం మూడుసార్లు పరమర్శించి భక్తివల్లనే మోక్షం సిద్దమని నిశ్చయించుకొని జనర్ధనుణ్ణీ ఆ మార్గాన ఆశ్రయించాడు. ఈశ్వరుడు ఆత్మ రూపన అఖిల భూతాలతో ఉంటాడు, బుద్యాది లక్షణాలకు గోచరిస్తాడు. భక్తవాత్సల్యంవల్ల వందనీయుడౌతాడు. ఆత్మ రూపుడైన శ్రీహరి కధలను ఆలకించేవారు,ఆయన పాద పద్మాలను చేరుకొంటారు తత్వనిష్టుడైనవాడు ముక్తినిమాత్రమే కామించి మనస్సులో పరమపురుషుణ్ణి నిలుపుకొని సేవిస్తాడు.దేవేంద్రుల్ని సేవించినట్లు ఆ శ్రీహరిని సేవిస్తే నిర్మలఙానమూ ! విరక్తి,ముక్తి కలుగుతాయి. ఆ విష్ణు కధలు విని ఆనందిచని వారేవరు" !        




        సూతుడు ఈవిధంగ చెపుతు ఉండగ శౌనకుడు ఇల అడిగాడు "సూత, శుకయోగి ఇల చెపితే వినే పరిక్షన్మహరాజు తనకు ఏం కావాలని కోరాడు ? ఆ మహరాజుకు ఆ యోగింద్రుడు ఏయే పుణ్యకధలు వినిపించాడు ఇవన్ని తెలుసుకోవాలని మాకు కుతూహలం కలుగుతున్నది."

        అనగ సూతుడిల చెప్పాడు.
       "మహరాజు పుట్టువెండ్రుకలు తీయనంత చిన్నతనమునుంచి విష్ణు సేవకోరి చేసినవాడు కదా ! అట్టి పరమభాగవతుడు కోరేదేమిటో ఊహించగలరు. మరి వినండి ! వాసుదేవ పరాయణుడైన శుకముని ఆ మహానాయకునికి ఈ విధంగా చెప్పాడు. 
     "విష్ణు కధలు మక్కువతొ వినే పుణ్యాత్ముని ఆయువునుగాక మిగిలినవారి ఆయుస్సుల్ని సూర్యుడు తన ఉదయస్తమయాలతో హరించుకుపోతున్నాడు. అది తెలియక అఙాని తాను చాల కాలం జీవించగలనని భ్రమపడి భార్యకోసం,పుత్రులకోసం, ధనంకోసం జీవితం వెచ్చించి వెచ్చించి యమకింకరులు వచ్చి బంధిచుకొనిపోతూ ఉన్నప్పుడు అయ్యో ! పుణ్యం చెయ్యకపోయాను . పాపబుద్దినైనాను అని దుఃఖిస్తాడు.  దుఃఖంవల్ల ప్రయోజనం ఏమిటి ?
     బ్రతికి ఉన్నపుడే  హరిపదారవిందాలను ఆశ్రయించి సంసార సముద్రాన్ని  తరలించాలి."

 శుకయోగి ఈ విధంగా ఉపన్యసించగా ఉత్తరాకుమారుడు కుమారులూ, మిత్రులు,బంధువులూ, భార్యాలూ, ఇతర సంపదలు మొదలైన ఇహ విషయలన్నిటిమీదా విరక్తిచెంది,మనస్సును హరిచరణ లగ్నముచేసి ఆ ముని కుమారునితో ఇల అన్నాడు.

     "విప్రోత్తమా ! నువ్వు సర్వాత్ముడైన విష్ణుదేవుణ్ణి స్తుతిస్తు ఉంటే నా సమస్త భ్రాంతులు  తొలగిపొయాయి. ఎంతసేపు విన్న విష్ణు చరిత్ర వినాలనే వేడుక కలుగుతున్నది.
    ఎప్పుడు ఒక్కడుగా ఉండే శ్రీహరి వేరు వేరు రూపాలు ధరించి వేరు వేరు విధాలుగా  సంచరించటం యెందుకు ? అలా సంచరించకపోతే పరమాత్మకు కలిగే నష్టం ఏమిటి ?
         అప్పుడు ఆ తాపసోత్తముడు తన మనస్సులో శ్రీహరిని , తండ్రి ఐన వ్యాసమహర్షిని స్మరించి,స్తుతించి ఆ రాజోత్తమునికి ఈ విధంగా సమధానం చెప్పాడు.
      నారదుడు బ్రహ్మను ప్రపంచ ప్రకారం అడగటం

     "మానవేశ్వరా ! విను ! ఒకప్పుడు నారద మునీంద్రుడు బ్రహ్మను ఇల అడిగాడు. "తండ్రీ ! నువ్వు నాలుగు ముఖాలుగల మహనీయమూర్థివి. దేవతలకందరికి పెద్దవు. వేదాలు నీ ముఖాలను ఆశ్రయించి. శబ్ధార్ధ సహిత లయి శోభిస్తున్నాయి. లోకజనని సరస్వతిదేవి నీ యిల్లాలు.  సమస్త విషయాలు నీకు కరతలమలకాలు. నాకొక సందేహం కలిగింది. దానిని నువ్వు తీర్చవా ?"

       కార్యభారం వివేకం ప్రసాదించే వారేవరు ? ఆ ప్రారంభ సంపదకు ఏది ఆధరం? ఏమిటి  కారణం ? దాని రూపం ఏమిటి ? నువ్వు సాలెపురుగు మాదిరిగ సంసారం ఎప్పుడు సాగిస్తునే ఉంటావు. దీనికి అంతం అనేది కనిపించదు.





నీవే దొరవని నేను భావిస్తున్నాను. మరి నీకు పైన ఇంకొక దొర ఉన్నాడా ? నువ్వే అందరికి అధికారివా ? నువ్వు యే లాభం కోసం ఈ లోకాలు సృష్టిస్తూ  ఉంటావు.

 నారధమహర్షి మాటలకు సంతోషించి ఇల అన్నాడు. బ్రహ్మ దేవుడు. "వత్సా ! నువ్వు తప్ప మరెవరు ఇలంటి ప్రశ్నలు అడగలేదు.నీకు ఇలాంటి సందేహం  కలగడమే నాకు ఆశ్చర్యకరంగా ఉంది. ఈ చరాచర ప్రకృతిని నా అంతట నేను నిర్మించలేదు. ఈశ్వరుని ఆనతి ననుసరించే సృష్టిచేసాను . ఈ సామర్ధ్యం నాకు ఆ ఈశ్వర ప్రసాదమే ! ఆ భగవంతుడ్ని  గుర్తించలేక మాయపశువై నేనే లోకేశ్వరుణ్ణని నాకు నమస్కరించే అఙానుల్ని చూస్తే నాకు నవ్వు వస్తుంది , కోపము వస్తుంది.ఈ సమస్తానికి కారణం విష్ణు మాయ సుమా ! హరి వ్యతిరేకమైనది లేదు. ఈ లోకాలకు నాకు, నీకు, మాయకు, ప్రాణులకు,నాయకుడు ఈశ్వరుడు, అనంతుడు ఐన ఆ హరి ఒక్కడే నాయకుడు.
   వత్సా ! నువ్వు నన్ను అడిగిన ప్రశ్నకు సమధానం ఇది. ఈ సమస్తానికి ఆధారం ఆ ప్రభువే కాని ఇంకెవ్వడు కాడు. ఆ విభుని ద్యానిస్తు వున్నందున మరపుచేత గూడ  నా నోటివెంట అసత్యం రాదు.  నే పలికిందంత సత్యమే అవుతుంది. నేను నలిననేత్రుణ్ణి,పుత్రుణ్ణి,అయినా ప్రజాపతినే యోగ విద్యావిశారదుణ్ణి అయిన నా జన్మ ప్రాకరం నాకు తెలియదు. మరి ఆ సర్వేశ్వరుని మహిమ తెలుసుకోగలనా ? 
 శ్రీమన్నారాయణుని లీలావతారాభి వర్ణనం
ఎప్పుడు ఇతర కధలు వినడం వల్ల శూన్యాలైన వీనులతో సర్వలోక సమ్మానాలైన హరి దివ్యకధామృతం గోలి ధన్యుడి వౌతవుగాక !
      హిరణ్యాక్షుడు భూవలయాన్ని చాప చుట్టినట్టు చుట్టి తీసుకొనిపూతువుండగ యఙమయ వరాహవతరం ధరించి విష్ణుదేవుడు వాణ్ణి సమ్హరించి లోకాన్ని  రక్షించాడు.        

    మరి యఙావతారమ విను ! స్వాయంభువుని కూతురైన ఆకూతికి రుచిప్రజాపతికి సుయఙుడుగా ఉదయించాడు హరి. దక్షిణ అనే కాంత యందు దేవతలను పుట్టించి ఇంద్రుడై ఉపేంద్రుడై లోకాల ఆర్తి హరించాడు కాబట్టి స్వాయంభుమనువు సంతోషించి అతణ్ణి హరి అని కీర్తించాడు. కాబట్టి సుయఙుడు హరి అవతారం ఎత్తినాడు.

       ఆ ప్రభువే తిరిగి దేవహుతికి కర్తమ ప్రజపతికే కపిలుడనే పెరున జన్మించి తల్లికి సౌఖ్యముపదేసించాడు. అది హరిని చేరటానికి సులువైన మార్గం.
       అటుపిమ్మట  అత్రిమహర్షి పుత్ర సంతానార్థమై తపస్సు చేయగా "మునీశ్వరా ! నేను నీకు దత్తుణ్ణయ్యను ' అని హరి అతనికి కుమారుడుగ జన్మించాడు. ఆ కుమరుడే దత్తత్రేయమహర్షి గ ప్రసిద్ధుడై హైహయాదుల్ని అనుగ్రహించాడు.
  నేను కల్పారంభంలో విశ్వాన్ని సృష్టించగోరి తపస్సుచేస్తు "సన" అని పలకగా సననామం కలవనందున సనక సనత్కుమార సనవతు జాతులు నాకు మానవ పుత్రులుగ ప్రసిద్దులయ్యరు. గతించిన కల్పించి పరగతించిన  ఆత్మీయ తత్వాన్ని సంప్రదాయ పద్దతిని లోకమంతట ప్రచారం చేసారు. వారు నలుగురైన విష్ణుకళలతో ఒక్కటైనవారె.

ధర్మునికి దాక్షాయణి అయిన కాంత యందు ఉదయించిన నర నారాయణులు మహాతపోనిష్టులయ్యారు . ఒకప్పుడు దేవేంద్రుడు వారి తపస్సును భంగపరచడానికి రంభాదులైన అప్సరసలను పంపించాడు. శృంగార చేష్టలతో తమను ఆకర్షించాటానికి ప్రయత్నించిన ఆ అప్సరసలను చూచి నవ్వుతూ నారాయణుడు తన ఊరువును  గోటితో చీరగా ఊర్వశి  ఉదయించింది . ఆ ఊర్వశి రూపలావణ్యాలను చూచి సిగ్గుపడి ఆ అప్సరసలు ఆమెనే తమకు ముఖ్యురాలిని చేసుకుని ఆ మహనీయులకు మ్రొక్కి తిరిగిపోయారు. రుద్రుడు క్రోధంతో కామ సంహారం చేసాడు ! కానీ నరనారాయణులు కామ క్రోధాలను రెంటిని జయించిన మహాత్ములు.


ఉత్తానపాద మహారాజుకు సునీతి  అనే రాణి యందు నారాయణాంశతో జన్మించాడు ధ్రువుడు . సవతి తల్లి సురుచి తనను నిరసించగా రోషించి అడవులకు వెళ్లి మహాతపస్సు చేసి సర్వోన్నత స్థానంలో సశరీరుడై వెలుగొంది ఇప్పటికి నిలచి ఉన్నాడు.


వేనరాజు బ్రహ్మ శాపానికి గురిని మరణించగా, అతని శరీరం నుంచి పుట్టాడు మహాత్ముడు పృధువు. తండ్రికి నరక విముక్తి కలిగించాడు ఆ విష్ణవంశా సంభూతుడు.  భూమిని గోవుగా చేసి ఎన్నో అమూల్య వస్తువుల్ని పితికి లోకాన్ని భాగ్య సంపన్నం కావించాడు.


సుదేనికి అగ్నిద్రునికి కలిగిన నాభివల్ల మేరుదేవియందు వృషభ  నామంతో ఉడాయించాడు హరి. జడస్వభావమైన యోగం తాల్చి పరమహంసలు పొదిగిన మార్గం ప్రకాశింపచేసాడు.


ఒకప్పుడు నేను చేస్తున్న యజ్ఞంలో సువర్ణవర్ణంతో యజ్ఞపురుషుడుగా  అవతరించాడు  నారాయణుడు. ఆ హయగ్రీవమూర్తిని విశ్వాసాల వెంట  వేదాలు ఉదయించాయి.  యుగాంత వేళలో వైవస్వత మనువుకు మత్సరూపంలో సాక్షాత్కరించి సర్వజీవులకూ ఆశ్రయ భూతుడయ్యాడు, నేను కోల్పోయిన వేదాలను తిరిగి నాకు తెచ్చి ఇచ్చాడు.


దేవదానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మదించే సమయం లో కవ్వం గా ఉన్న మందరగిరి సముద్రం లో మునిగిపోగా, కూర్మావతారం రూపం ధరించి ఆ మహాపర్వతాన్ని వీపున నిలిపి అమృతోదయానికి కారణమైనాడు . లోకకంటకుడైన హిరణ్యకశిపుడికి నృసింహరూపాన ప్రత్యక్షమై వాణ్ణి సంహరించి సాధువులను రక్షించాడు
.


గజేంద్రుడు మొసలికి చిక్కి మొరపెట్టగా వైకుంఠం నుంచి హుటాహుటిన వచ్చి, మకరాన్ని సంహరించి, ఆ భక్తుణ్ణి రక్షించాడు. ఇది ఆదిమూలవతారం .


ఇంతేకాక ఆ పరమేశ్వరుడు హంసవతారుడై నీ భక్తికి సంతోషించి మహాభాగవత పురాణం నీకు ఉపదేశించాడు గదా !


మనువై అవతరించి చక్రాయుధుడై దుష్టులైన రాజులను వధించి శిష్టుల్ని పరిపాలించాడు. ధన్వంతరి పేరుతో అవతారం ధరించి తనపేరు స్మరించిన వారందరికీ రోగనివారం చేస్తూ ఆయుర్వేదం కల్పించాడు. హైహయవంశపు రాజులు దుష్టులైన సాధుకంటకులు కాగా, తనగొడ్డలి చేత ఇరవై ఒక్క మారు దుష్టరాజుల నందరిని ఖండించి, భూమినంతటిని బ్రాహ్మణులకు దానం చేసి పరశురాముడని ప్రసిద్దికెక్కాడు.




నారదా ! రావణ కుంభకర్ణులనే రాక్షస సోదరులు త్రిలోక భయంకరులై దేవ,ముని , మనుష్యజాతులన్నింటిని పీడిస్తూ ఉండగా , సూర్య వంశాలంకరమై దశరథ మహారాజుకు కుమారుడై అవతరించాడు. భరత లక్ష్మణ శత్రుజ్ఞులకు అగ్రజుడై శ్రీరాముడనే పేర విశ్రుతుడై శివ ధనుర్బంగం కావించి జనకరాజు పుత్రిక అయినా సీతను చేపట్టాడు. తండ్రి సత్యం పాటించటానికి సీత లక్ష్మణులతో తాపసవృత్తితో వనవాసం చేశాడు, ముని జనుల్ని పీడించే ఖరాది రాక్షసులను ఖండించాడు. సీతను అపహరించిన రావణుణ్ణి , అతనికి సాయపడ్డ సమస్త రాక్షసుల్ని శాస్త్రాగ్ని జ్వాలలచేత దహించాడు.  శరణువేడిన సుగ్రీవ విభీషణుల్ని కిష్కింద లంక నగరాలకు అధిపతుల్ని చేశాడు. సీత సమేతుడై అయోధ్యకు వెళ్లి పదకొండువేల సంవత్సరాలు ప్రజారంజకంగా భూలోకం పాలించి వైకుంఠం చేరుకున్నాడు.




భూదేవి ద్వాపరాంతం లో రాక్షస భాధ సహింపలేక మొరపెట్టగా యదువంశంలో తన సితాసిత కేషాంశాలతో రామకృష్ణ మూర్తులుగా వాసుదేవుని భార్యలైన రోహిణి దేవకి దేవులయందు జన్మించాడు. దుష్టుల్ని అందర్నీ ధనుమాడి భూభారం తీర్చాడు ఆ మహానుభావుడు. వ్రేపల్లెలో యశోద ప్రక్కలో పాలుతాగే వయస్సులోనే విషస్తని అయినా పోతన అనే రక్కసిని నిర్ములించాడు. మూడు నెలల బాలుడుగా ఉన్నపుడే, కాలితో తన్ని శకటాసురుణ్ణి యమపురానికి పంపాడు. తల్లి తనను రోటికి కట్టితే రాతితో కూడా వెళ్లి మద్దుల రూపంలో ఉన్న యక్షులను శాపవిమోచనం కల్పించాడు. కాళీయుడనే నాగరాజును మర్దించి యమునా మడుగునుంచి వెళ్లగొట్టి అక్కడి జలమును మనుష్యులకు , పశువులకు  స్నానపాన యోగ్యం చేశాడు. దావాగ్నిలో చిక్కిన గోపాలకుల్ని రక్షించగోరి ఫాలాక్షుడు హాలాహలాన్ని మ్రింగినట్లు దావాగ్నిని కబళించివేశాడు.  దేవేంద్రుడు రాళ్లవాన కురుయిస్తుంటే ఏడేళ్ళబాలుడైయుండి గోవర్ధనగిరిని గొడుగుగా యెత్తిపట్టి , గోపకులాలను కాపాడాడు. వేణుగానంతో మ్రొళ్లను చిగురింపచేసి  తనవద్దకు వచ్చే గోపికలను హరించబోయిన శంఖచూరుడ్ని మదహీనుడ్ని చేసాడు. నరకమురా పూలంబ కంసాది క్రూర దానవులను నేలగూల్చాడు.  బలభీమార్జునాది వీరుల నిమిత్తమాత్రులుగా దుష్టరాజసంహారం కావించి సాధువులను రక్షించాడు.